ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వమని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు అన్నారు. తీవ్ర అనారోగ్యంతో వైద్య ఖర్చులకు డబ్బులేక ఇబ్బంది పడుతున్న లక్ష్మణ్ అనే వ్యక్తికి అతని స్నేహితులు ఏర్పాటు చేసిన రూ.40 వేలను ఆయన చేతులు మీదుగా అందజేశారు.
అనారోగ్యం కుంగదీసింది.. స్నేహం అండగా నిలిచింది - తెలంగాణ న్యూస్
అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి మేమున్నామంటూ ముందుకొచ్చారు అతని స్నేహితులు. వైద్య ఖర్చుల కోసం రూ.40 వేలు అందించి ఆదర్శంగా నిలిచారు. ఈ మొత్తాన్ని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ నాగమల్లు చేతుల మీదుగా అందజేశారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మణ్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పేదరికంతో వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబ సభ్యులకు అతని స్నేహితులు స్పందించి రూ.40వేల ఆర్థిక సహాయం చేశారు. ఈ మొత్తాన్ని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా స్నేహితునికోసం ముందుకొచ్చిన బత్తుల ఈదయ్య, పంతం లింగయ్య, సంజీవరెడ్డి, ప్రభంజన్, మధు, జనార్ధన్, మల్లేష్, గోపిలను సీఐ అభినందిచారు.
ఇదీ చదవండి:చదువు ఎంఏ ఎంఈడీ.. పంక్చర్ దుకాణంలో పని