తెలంగాణ

telangana

ETV Bharat / state

'రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి' - YADADHRI BHUVANAGIRI DISTRICT

ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మిత్రులు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో చోటు చేసుకుంది.

స్నేహితుల ఆకస్మిక మరణంతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు

By

Published : Jun 22, 2019, 3:01 PM IST

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణానికి చెందిన సంతోష్ చారి, చొల్లేటి మురళి చారి స్నేహితులు. సంతోష్ పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా..పెద్ద అంబర్ పేట వద్ద స్నేహితుడు మురళి చారిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు.
రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇద్దరు స్నేహితుల ఆకస్మిక మరణంతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

వెనక నుంచి వచ్చి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
ఇవీ చూడండి : చంద్రబాబుకు అవమానం.. సిబ్బంది తీరు వివాదాస్పదం...

ABOUT THE AUTHOR

...view details