తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రి హరీశ్​రావు దాతృత్వం.. మున్సిపల్ కౌన్సిలర్ సహాయం - FREE DISTRIBUTION OF RICE AND MONEY BY MUNICPAL COUNSELLOR ANIL

లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్​ మణికొండలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక అలమటిస్తున్నారు. ఈ క్రమంలో ఈటీవీ భారత్ చొరవతో.. ఆర్థిక మంత్రి హరీశ్ కృషితో బాధితులకు ఉపశమనం లభించింది. మణికొండ 1వ వార్డు కౌన్సిలర్ వల్లభనేని అనిల్ వారికి నిత్యావసర సరకులు పంపిణీ చేసి ఆదుకున్నారు.

భవన నిర్మాణ కూలీలకు నిత్యవసర వస్తువుల పంపిణీ
భవన నిర్మాణ కూలీలకు నిత్యవసర వస్తువుల పంపిణీ

By

Published : Mar 29, 2020, 4:00 PM IST

Updated : Mar 29, 2020, 4:22 PM IST

వారంతా పొట్ట చేత పట్టుకుని చత్తీస్​గఢ్​ నుంచి హైదరాబాద్​కు వలస వచ్చారు. నగరంలోని మణికొండలో భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో వారికి ఉపాధి లేక పస్తులుంటున్నారు. గమనించిన ఈటీవీ భారత్ ప్రతినిధి వారిని పలకరించారు.

వారి సమస్యలు విని వెంటనే వారి దీనావస్థనుఆర్థిక శాఖ మంత్రి హరీశ్ దృష్టికి తీసుకెళ్లారు ఈటీవీ భారత్ ప్రతినిధి. స్పందించిన మంత్రి హరీశ్.. మణికొండ పురపాలిక మెుదటి వార్డు కౌన్సిలర్ వల్లభనేని అనిల్​కు విషయం ఫోన్​లో చెప్పారు. స్థానికంగా ఉన్న అనిల్ వెంటనే స్పందించి బాధితులకు బియ్యం, పప్పు, డబ్బులు పంపిణీ చేశారు.

భవన నిర్మాణ కూలీలకు నిత్యవసర వస్తువుల పంపిణీ

మంత్రి హరీశ్ కృషి భేష్...

సమాచారాన్ని అందుకున్న వెంటనే స్పందించిన మంత్రి హారీశ్​కు అనిల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం బాధితులకు సామగ్రి సమకూర్చడంలో సహకరించిన బిల్డర్ శ్రీనివాస్​కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎవరూ ఆకలి బారిన పడకూడదనే తాము సరకులు పంపిణీ చేసినట్లు కౌన్సిలర్ అనిల్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి : లాక్​డౌన్​ను ఉల్లంఘిస్తే 14రోజులు క్వారంటైన్‌: కేంద్రం

Last Updated : Mar 29, 2020, 4:22 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details