తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా గంజాయి తరలిస్తోన్న నలుగురు అరెస్ట్​ - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

రంగారెడ్డి జిల్లాలోని శంకర్​పల్లి మున్సిపాలిటీ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Four crimunals arrested for smuggling marijuana in rangareddy district
అక్రమంగా గంజాయి తరలిస్తోన్న నలుగురు అరెస్ట్​

By

Published : Feb 16, 2021, 7:32 PM IST

హైదరాబాద్ నుంచి కర్ణాటకకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

కొందరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా కర్నాటకకు రవాణా చేస్తున్నారన్న సమాచారంతో చేవెళ్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మున్సిపాలిటీ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:'రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదు'

ABOUT THE AUTHOR

...view details