తాను ఏ పదవిని చేపట్టినా చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని.. సౌందర్య రాజన్ పంతులు ఆశీర్వాదం తీసుకుంటానని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన మాజీ మంత్రి డీకే అరుణ తెలిపారు.
సౌందర్యరాజన్ ఆశీస్సులు తీసుకున్న డీకే అరుణ - మాజీ మంత్రి డీకే అరుణ చిలుకూరు బాలాజీ ఆలయ దర్శనం
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనా సందర్భంగా మాజీ మంత్రి డీకే అరుణ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ అర్చకులు సౌందర్యరాజన్ పంతులు ఆశీర్వాదం తీసుకున్నారు.

సౌందర్యరాజన్ ఆశీస్సులు తీసుకున్న డీకే అరుణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నపుడు ధార్మిక పరిషత్తుకు ఎంత కృషి చేశానో ఇప్పుడు జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్తుకు తనవంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు ఎల్లవేళలగా అందుబాటులో ఉండి కేంద్రం నుంచి మెరుగైన సేవలు అందిస్తానని వెల్లడించారు.
ఇదీ చూడండి:భాజపా జాతీయ కార్యవర్గంలో అరుణ, లక్ష్మణ్
TAGGED:
latest news of dk aruna