కాటేదాన్ ప్రధాన రహదారిపై కనిపించిన చిరుత ప్రస్తుతం పొదల్లో నక్కి ఉందని... రాత్రి వేళ అది ఆహారం, నీళ్ల కోసం బయటికి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చిరుతను బంధించేందుకు బోన్లను వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేశారు. బోన్లలో మేకను ఎరగా వేస్తున్నారు. మేక శబ్దం విని దాన్ని తినడానికి చిరుత బోన్లోకి వచ్చి చిక్కుతుందని భావిస్తున్నారు.
50ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న పొలంలో చుట్టు పొదలున్నాయి. పొదల్లో నక్కిన చిరుతను బంధించేందుకు అటవీ, పోలీసు అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. డ్రోన్ కెమెరా, కెమెరా ట్రాప్‌ల ద్వారా చిరుత నక్కిన ప్రదేశాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రివేళల్లో బుద్వేల్, నేతాజి నగర్, కాటేదాన్ వాసులు బయటికి రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు