తెలంగాణ

telangana

ETV Bharat / state

FDI: తెలుగు రాష్ట్రాలకు విదేశీ పెట్టుబడులు తక్కువే!! - తెలుగు రాష్ట్రాలకు విదేశీ పెట్టుబడులు తక్కువే!

తెలుగు రాష్ట్రాలకు విదేశీ పెట్టుబడులు తక్కువే ఉన్నాయి. డీపీఐఐటీ డేటా ప్రకారం 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి మధ్యకాలంలో దేశంలోకి రూ.4,42,568.84 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా అందులో తెలంగాణకు 1.94%, ఆంధ్రప్రదేశ్‌కు 0.14%వాటా దక్కాయి.

Foreign investment in Telugu states is low
FDI: తెలుగు రాష్ట్రాలకు విదేశీ పెట్టుబడులు తక్కువే!!

By

Published : Sep 4, 2021, 7:36 AM IST

Updated : Sep 4, 2021, 8:02 AM IST

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) రాబట్టడంలో తెలుగు రాష్ట్రాలు వెనుకబడి పోయాయి. కేంద్ర వాణిజ్యశాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ, అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) డేటా ప్రకారం 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి మధ్యకాలంలో దేశంలోకి రూ.4,42,568.84 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా అందులో తెలంగాణకు 1.94%, ఆంధ్రప్రదేశ్‌కు 0.14%వాటా దక్కాయి.

ఝార్ఖండ్‌ కంటే తెలంగాణ ఒక మెట్టుపైన నిలవగా బిహార్‌ కంటే ఆంధ్రప్రదేశ్‌ ఒక మెట్టు పైన ఉంది. దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 63.84% గుజరాత్‌, మహారాష్ట్రలకే వెళ్లాయి. ఈ విషయంలో ప్రధానమంత్రి స్వరాష్ట్రం 36.79% వాటాతో తొలిస్థానంలో 27.05% వాటాతో మహారాష్ట్ర రెండోస్థానాన్ని ఆక్రమించింది. కేంద్ర వాణిజ్యశాఖ 2019 అక్టోబర్‌ వరకు ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల వారీగా ఎఫ్‌డీఐల వివరాలు వెల్లడించేది. ఆ తర్వాత నుంచి రాష్ట్రాల వారీగా ప్రకటించడం మొదలుపెట్టింది.

2000 ఏప్రిల్‌ నుంచి 2019 సెప్టెంబర్‌ వరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,09,824 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాగా... 2019 నుంచి 2021 మార్చి వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు రెండింటికీ కలిపి రూ.15,596.71కోట్లు మాత్రమే వచ్చాయి. దేశవ్యాప్తంగా పెద్ద రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడుల వరుసను పరిశీలిస్తే తెలంగాణ 7, ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానానికి పరిమితమయ్యాయి.

2019 అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి 31వరకు వచ్చిన పెట్టుబడుల పరంగా తెలంగాణ 8, ఆంధ్రప్రదేశ్‌ 13వ స్థానంలో కనిపించినప్పటికీ కేవలం 2020-21 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం తెలంగాణ 7కి చేరితే, ఆంధ్రప్రదేశ్‌ 15వ స్థానానికి పడిపోయింది. పెద్దరాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానంలో బిహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గడ్‌తో పాటు ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి.

ఇదీ చదవండి: modi - kcr meet: ప్రధాని మోదీకి పది లేఖలు అందజేసిన సీఎం కేసీఆర్​

Last Updated : Sep 4, 2021, 8:02 AM IST

ABOUT THE AUTHOR

...view details