భారీ వర్షంతో హైదరాబాద్ శివారు అనాజ్‌పూర్, యూకే గూడ రహదారిపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద వస్తుండడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి అనాజ్‌పూర్‌కు వచ్చే దారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లష్కర్‌గూడ వద్ద వాగు ఉద్ధృతి వల్ల వాహనాలు నిలిచిపోయాయి. వాగు ఉద్ధృతిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఓ కారు కొట్టుకుపోయింది..
అనాజ్‌పూర్, యూకే గూడ మధ్య రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు - రోడ్లపై ప్రవహిస్తోన్న వరద నీరు
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి. రహదారులపై నీరు నిలిచిపోయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. హైదరాబాద్ శివారు అనాజ్‌పూర్-యూకే గూడ రహదారిపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద వస్తుండడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అనాజ్‌పూర్, యూకే గూడ మధ్య రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు