ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందించండి: బాధితులు - కుత్బుల్లాపూర్​ వార్తలు

తమకు అనుకూలమైన వారికే కాకుండా... బాధితులందరికీ ఆర్థిక సహాయం అందించాలని కుత్బుల్లాపూర్​లోని వరద బాధితులు డిమాండ్ చేశారు. న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

flood victims protest along with congress leaders in kutbullapur
అర్హులైన వారికి ఆర్థిక సహాయం అందించండి: బాధితులు
author img

By

Published : Nov 4, 2020, 2:12 PM IST

రంగారెడ్డి జిల్లాలోని కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో... అర్హులైన వరద బాధితులకు ఆర్థిక సాయం అందలేదంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కేవలం తమకు అనుకూలమైన వారికి ఆర్థిక సహాయం అందించారని వారు ఆరోపించారు. పదివేల నుంచి... 30 వేలకు సహాయాన్ని పెంచి... అర్హులైన వారికి అందించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:వరద బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి సాయం అందిస్తాం: మంత్రి తలసాని

ABOUT THE AUTHOR

author-img

...view details