రంగారెడ్డి జిల్లా జల్పల్లి పురపాలికలో వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇంటింటికీ వెళ్లి పురపాలిక కో ఆప్షన్ మెంబర్ సుర్రెడ్డి కృష్ణా రెడ్డి, కౌన్సిలర్లు బాధితులకు వరద సాయాన్ని అందించారు.
జల్పల్లిలో వరద బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందజేత - రంగారెడ్డి జిల్లా తాజా సమాచారం
హైదరాబాద్లో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. రంగారెడ్డి జిల్లా జల్పల్లి పురపాలికలో వరద బాధితులకు కో ఆప్షన్ మెంబర్ సుర్రెడ్డి కృష్ణా రెడ్డి, ఇతర కౌన్సిలర్లు పది వేల రూపాయల చొప్పున నగదును అందించారు.
జల్పల్లిలో వరద బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందజేత
జల్పల్లి పురపాలక పరిధిలో వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పురపాలిక అధికారులు, కౌన్సిలర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.