తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ సహాయం అందలేదంటూ వరద బాధితుల ఆందోళన - జల్​పల్లి మునిసిపాలిటీ వద్ద వరద బాధితుల ఆందోళనలు

వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ. పదివేల సహాయం తమకు అందలేదని రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపల్​ కార్యాలయం ఆవరణలో బాధితులు ఆందోళన చేపట్టారు. స్పందించిన మున్సిపల్​ ఛైర్మన్​, కమిషనర్​ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

flood effected people protest at jalpalli municipality rangareddy district
ప్రభుత్వ సహాయం అందలేదంటూ వరద బాధితుల ఆందోళన

By

Published : Oct 31, 2020, 7:31 PM IST

వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ. పదివేల సహాయం తమకు అందలేదని రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపల్​ కార్యాలయం ఆవరణలో బాధితులు ఆందోళన చేపట్టారు. జల్​పల్లి, శ్రీ రాం కాలనీ, పహాడి షరీఫ్ తదితర ప్రాంతాల నుంచి బాధితులు కార్యాలయానికి తరలి వచ్చారు. కొందరు నాయకులు వారి అనుకూల వర్గం వారికే ప్రభుత్వ సహాయం అందేలా చేశారని ప్రజలు ఆరోపించారు. సమాచారం అందుకున్న పహాడి షరీఫ్ పోలీసులు.. పరిస్థితులు అదుపు తప్పకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ సాది, కమిషనర్.. బాధితులకు నచ్చజెప్పి మరో రెండు రోజుల్లో ప్రభుత్వ సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.

తన వార్డులో అర్హులందరికీ రూ. పదివేల సహాయం అందించానని వార్డు కౌన్సిలర్​ అన్నారు.

వరద బాధితులకు అందిస్తున్న సహాయంలో అవకతవకలు జరిగినట్లు తమకు ఫిర్యాదులు అందాయని ఛైర్మన్​ అన్నారు. వాటి పైన విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు. అవినీతికి పాల్పడినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి:అన్ని కాలాల్లోనూ బోడ కాకర సాగుకు విశ్రాంత ఉద్యోగి ప్రయత్నం

ABOUT THE AUTHOR

...view details