తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇద్దరు బాలికలపై అత్యాచారం కేసులో ఐదుగురికి జీవితఖైదు - telangana varthalu

ఇద్దరు బాలికలపై అత్యాచారం కేసులో ఐదుగురికి జీవితఖైదు
ఇద్దరు బాలికలపై అత్యాచారం కేసులో ఐదుగురికి జీవితఖైదు

By

Published : Aug 16, 2021, 9:05 PM IST

Updated : Aug 16, 2021, 9:45 PM IST

21:02 August 16

ఇద్దరు బాలికలపై అత్యాచారం కేసులో ఐదుగురికి జీవితఖైదు

అక్కా చెల్లెల్లపై అత్యాచారం ఘటనలో రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఐదుగురికి జీవిత ఖైదు విధిస్తూ మెట్రోపాలిటన్​ స్పెషల్​ జువైనల్​ (ఎంఎస్​జె) కోర్టు న్యాయమూర్తి సురేష్ తీర్పునిచ్చారు. 

ఇదీ జరిగింది..

2016 నవంబర్ 3న బాలికలపై అత్యాచార జరిగింది. కవల పిల్లలైన ఇద్దరి అక్కాచెల్లెల్ల వయసు అప్పటికి 9 ఏళ్లు. బాలికల తల్లే.. విటుల దగ్గర డబ్బులు తీసుకొని... తన కూతుళ్ల దగ్గరికి పంపించేది. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుండటంతో చుట్టుపక్కల వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని అక్కాచెల్లెల్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. తల్లితో పాటు 8 మందిపై కేసు నమోదు చేశారు.

   నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉండటం గమనార్హం. మైనర్లకు సంబంధించిన కేసు ప్రస్తుతం బాల నేరస్థుల న్యాయస్థానంలో కొనసాగుతోంది. మిగతా 5 మందికి సంబంధించిన కేసులో మైలార్ దేవ్ పల్లి పోలీసులు పక్కా ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, దర్యాప్తు అధికారులు ఇందిర, అనురాధ, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజిరెడ్డిలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ అభినందించారు.

ఇదీ చదవండిBaby in Cemetery: ఓ వైపు కాలుతున్న శవాలు.. మరోవైపు సమాధులు.. మధ్యలో పసికందు

Last Updated : Aug 16, 2021, 9:45 PM IST

ABOUT THE AUTHOR

...view details