తెలంగాణ

telangana

ETV Bharat / state

జల్​పల్లి చెరువులో చేపపిల్లలను వదిలిన అధికారులు

మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేపపిల్లలను రంగారెడ్డి జిల్లా జల్​పల్లి పెద్దచెరువులో వదిలారు. హైదరాబాద్​ మత్స్యశాఖ సహకార సంఘం అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Fish distribution in rangareddy dist jalpalli muncipality
జల్​పల్లి చెరువులో చేపపిల్లలను వదిలిన అధికారులు

By

Published : Nov 10, 2020, 9:36 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి పెద్దచెరువులో మత్స్యశాఖ అధికారులు ప్రభుత్వం అందిస్తున్న ఎనిమిది వేల ఉచిత చేపపిల్లలను వదిలారు. హైదరాబాద్​ మత్స్యశాఖ అధికారి సుకీర్తి, సహకార సంఘం ఛైర్మన్ కొప్పు పద్మతో కలిసి జల్​పల్లి పురపాలక ఛైర్మన్​ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది పాల్గొన్నారు.

మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందిస్తోందని అధికారులు తెలిపారు. మత్స్యకారుల కుటుంబాల ఉపాధికి సహకరిస్తున్న ప్రభుత్వానికి మత్స్యకారుల సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జల్​పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్​ మెంబర్, మత్స్యకారుల సహకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రఘునందన్​ రావుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్

ABOUT THE AUTHOR

...view details