తెలంగాణ

telangana

ETV Bharat / state

కులవృత్తుల అభివృద్ధికి కేసీఆర్ కృషి : మంచిరెడ్డి - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద ఉచిత చేప పిల్లలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పంపిణీ చేశారు. కులవృత్తుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.

fish distribution by mla manchireddy kishan reddy at ibrahimpatnam in rangareddy district
కులవృత్తుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి: మంచిరెడ్డి కిషన్ రెడ్డి

By

Published : Dec 16, 2020, 4:03 PM IST

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద ఉచిత చేప పిల్లలను పంపిణీ చేశారు. సుమారు 8లక్షల ఎనభై వేల చేప పిల్లలను చెరువులో వదిలారు.

ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడంతో దాదాపు నియోజకవర్గంలోని అన్ని చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తోందని ఆయన తెలిపారు. చెరువుపై ఆధారపడిన మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మత్య్స పరిశ్రమ శాఖ అధికారి సుకీర్తి, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు దివిటి.రాములు, కార్యదర్శి గుంటి భీంరావ్, మత్య్సకారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:తెలంగాణ‌లో పెట్టుబడి పెట్టనున్న ఫియట్‌ క్రిస్లర్‌

ABOUT THE AUTHOR

...view details