హైదరాబాద్: తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి
12:02 March 19
హైదరాబాద్: తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఏడు రౌండ్ల తర్వాత తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి.. తన సమీప ప్రత్యర్థి రామచందర్‌రావుపై(భాజపా) 8,021 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఏడు రౌండ్లు పూర్తయినా.. ఎవరికి స్పష్టమైన ఆధిక్యం రాని నేపథ్యంలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి కానుంది. మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం లేక పోలేదని అధికారులు అంటున్నారు. అదే జరిగితే శనివారం రాత్రికి తుది ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు. ఏడో రౌండ్ తర్వాత 21,309 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో 3,57,354 ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి విజయానికి ఇంకా 1,79,175 ఓట్లు కావాల్సి ఉంది. తెరాస అభ్యర్థి వాణీదేవీ విజయం సాధించేందుకు 66,486 ఓట్లు, భాజపా అభ్యర్థి రాంచందర్‌రావుకు 74,507, స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్‌కు 1,25,565, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికు 1,47,621, తెదేపా అభ్యర్థి ఎల్.రమణకు 1,73,202 ఓట్లు జమకావాల్సి ఉంటుంది.
క్రమ సంఖ్య | అభ్యర్థులు | వచ్చిన ఓట్లు |
1 | వాణీదేవి | 1,12,689 |
2 | రాంచందర్‌రావు | 1,04,668 |
3 | ప్రొ.నాగేశ్వర్ | 53,610 |
4 | చిన్నారెడ్డి | 31,554 |
5 | ఎల్.రమణ | 5,973 |
TAGGED:
పట్టభద్రుల ఎన్నికల వార్తలు