మైలార్దేవ్పల్లిలో ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం - fire accident in hyderabd

08:00 January 23
ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో మంటలు..
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని దానమ్మ దోపిడీ వద్దనున్న ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాం నుంచి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారాన్ని అందించారు.
వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బంది 5 అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణం వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ గోదాంకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని ఇలాంటివి చుట్టుపక్కల చాలా గోదాంలు ఉన్నాయని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.
TAGGED:
fire accident in hyderabd