తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటో డ్రైవర్​ కుటుంబానికి ఆర్థిక సహాయం - తెలంగాణ తాజా వార్తలు

ఆ గ్రామంలోని ఆటో డ్రైవర్లందరూ ఒకటిగా ఉంటారు. వారిలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా వెంటనే సాయం చేసుకుంటారు. ఈ క్రమంలో ఓ డ్రైావర్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆటో డ్రైవర్లు ఏకమయ్యారు. వారిలో వారే ఏం చెద్దామని ఆలోచించుకున్నారు. చివరికి ఓ నిర్ణయం తీసుకున్నారు. మృతి చెందిన డ్రైవర్​ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి చేయూతనిచ్చారు.

financial help to driver family, anajpur village rangareddy
ఆటో డ్రైవర్​ కుటుంబానికి ఆర్థిక సహాయం

By

Published : Jun 20, 2021, 2:24 PM IST

ఓ డ్రైవర్​ అనారోగ్యంతో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న తోటి డ్రైవర్లు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదర్శంగా నిలిచారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్​పూర్ డ్రైవర్స్ యూనియన్ సభ్యుడు మల్లరి సైదులు అనారోగ్యంతో మే 1న మృతిచెందాడు.

ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి డ్రైవర్స్ యూనియన్​లో ఉన్న... డ్రైవర్లు అందరూ కలసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. మొత్తం 51,200 రూపాయలు వసూలు చేసి వారి కుటుంబానికి అందించారు.

ఇదీ చూడండి:SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్​ అవసరమా ?

ABOUT THE AUTHOR

...view details