రంగారెడ్డి జిల్లాలోని మణికొండ లాన్కో హిల్స్ అదే అపార్టుమెంట్లో నివసించే శ్రీనివాస్ రెడ్డి తన ఆరు సంవత్సరాల కూతురితో కలిసి లిఫ్ట్‌లోకి ఎక్కాడు. 34వ అంతస్తుకు చేరుకున్నాక లిఫ్ట్ ఆగిపోయింది. తలుపులు తెరుచుకోలేదు. ఆందోళన చెందిన శ్రీనివాస్ రెడ్డి ఫోన్ కాల్స్ చేసినా అపార్ట్మెంట్ వాసులెవరూ స్పందించలేదు.
లిఫ్ట్‌లో చిక్కుకున్న తండ్రి, కుమార్తె.. - మణికొండ లాన్కో హిల్స్
ఇది హైదరాబాద్ మహా నగరం.. ఇక్కడ నివసించే చాలా మందికి తమ ఇంటి పక్కన ఎవరు ఉంటారు, ఏం చేస్తారనే విషయమే తెలియదు. ఇక గేటెడ్ కమ్యూనిటీల్లో పరిస్థితి మరోలా ఉంటుంది. మాట పలకరింపులూ తక్కువగానే ఉంటాయి. ఏదో కమ్యూనిటీ మీటింగ్ అయితే తప్ప ఒకరినొకరు కలుసుకునే దాఖలు తక్కువగానే చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితిలో ల్యాంకో హిల్స్ లిఫ్ట్‌లో తండ్రి కుమార్తె 40 నిమిషాల పాటు భయాందోళనతో యాతన అనుభవించారు.
ల్యాంకో హిల్స్ లిఫ్ట్‌లో చిక్కుకున్న తండ్రి, కుమార్తె
సుమారు 40 నిమిషాల పాటు లిఫ్ట్‌లో ఇర్కుపోయి వేదన అనుభవించారు. చివరికి తానే స్వయంగా లిఫ్ట్ తలుపుల్ని తొలగించి కూతురుతో సహా బయటపడ్డారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడివాళ్లు అక్కడే ఉండటం వల్ల తండ్రి, కూతురు ఫోన్‌కు ఎవరు స్పందించలేదు. విపత్కరమైన దుస్థితిని శ్రీనివాస్ రెడ్డి విజయవంతంగా ఎదుర్కొన్నారు.
Last Updated : May 10, 2020, 4:28 PM IST