రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం షాద్ నగర్, చేగూరు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గన్నీ బ్యాగుల కోసం మంగళవారం సాయంత్రం అన్నదాతలు ఆందోళనకు దిగారు. బ్యాగుల లారీ వస్తుందన్న సమాచారం తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు సాయంత్రం కొనుగోలు కేంద్రాలకు చేరుకున్నారు.
షాద్‌నగర్ కేంద్రానికి 12 వేల బ్యాగులతో పాటు మేకగూడ, కొత్తపేట పీఎసీఎస్ కేంద్రాలకు పౌర సరఫరా శాఖ అధికారులు లారీలో బస్తాల గట్టీలను పంపించారు. షాద్‌నగర్ కేంద్రానికి కేటాయించిన బస్తాల గట్టీలను దింపి లారీ వెళ్తుండగా సంచుల గట్టీలన్నీ ఇక్కడే దించాలని రైతులు వాహనాన్ని అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశమని రైతులకు చెప్పినా వారు వినకుండా గట్టీలను కిందకు దింపారని పీఏసీఎస్ షాద్‌నగర్ సీఈవో రఘునందన్, చేగూరు పీఎసీఎస్ సీఈవో వెంకటయ్య తెలిపారు.