రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలుకు బస్తాలు ఇప్పించాలని కోరారు. సరైన సమయానికి బస్తాలు ఇవ్వకపోవడం వల్ల… రోజుల తరబడి ధాన్యం కొనుగోలు గాక, పొలంలోనే ఉంటుందని, అకాల వర్షాలతో పంట తడిసిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తహసీల్దార్ కార్యాలయం ముందు రైతుల నిరసన - ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం
ఆరుగాలం పండించిన ధాన్యం ఇంకా పొల్లాల్లోనే ఉందని రైతులు ఆందోళన చెందారు. అకాల వర్షాలు, బస్తాల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలుకు బస్తాలు ఇప్పించాలంటూ ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు నిరసన తెలిపారు.
తహసీల్దార్ కార్యాలయం ముందు రైతుల నిరసన
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు బస్తాలు అందించి, ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లును కోరారు.
ఇదీ చూడండి:'రైతుల నుంచి చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలి'