తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం చిత్ర పటానికి పాలభిషేకం చేసిన రైతులు - పాలాభిషేకం చేసిన రైతులు తాజా వార్త

ధరణితో తమకు చాలా మేలు జరుగుతుందని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా తనకు వెంటనే పాస్​పుస్తకం లభించిందన్న సంతోషంతో ఓ రైతు సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాడు.

farmers done palabhishekam to the cm kcr photo at chevella in rangareddy
సీఎం చిత్ర పటానికి పాలభిషేకం చేసిన రైతులు

By

Published : Nov 6, 2020, 5:59 PM IST

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ధరణి వెబ్ పోర్టల్ సేవలు చాలా సులభతరంగా ఉన్నాయంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని తహసీల్దార్ కార్యాలయంలో మొదటి రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే పాసు పుస్తకం పొందడం చాలా ఆనందంగా ఉందంటూ మహ్మద్​ ఇమ్రానన్​ అనే రైతు సీఎం చిత్ర పటానికి పాలభిషేకం చేశాడు.

మండలంలోని ఆలూరు-1లో సర్వే నెంబర్ 165/1/5 లో ఎకరం భూమిని మహ్మద్ ఇమ్రానన్ కొనుగోలు చేశాడు. అయితే దాని రిజిస్ట్రేషన్​ కోసం చేవెళ్లలో మొదటి స్లాట్​ బుక్​ చేసుకున్నాడు. కాగా వెంటనే శుక్రవారం పాస్​పుస్తకం లభించడం పట్ల అతను హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్​కు తన కృతజ్ఞతలను పాలాభిషేకం రూపంలో తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు సైయాద్ బాబార్, రైతులు రాం చంద్రయ్య, మల్లేశ్​, అజ్జు, శ్రీనివాస్, రాజు, యూసుబ్, షబ్బీర్, నర్సింలు, ఖదీర్, పెయుమ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దు: మంత్రి గంగుల కమలాకర్​

ABOUT THE AUTHOR

...view details