రంగారెడ్డి జిల్లాలో విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి - rangareddy dist news
విద్యుదాఘాతంతో రైతులు మృతి
11:30 June 25
రంగారెడ్డి జిల్లాలో విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి
రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బోరు వేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఓ యువ రైతు, అతని చిన్నాన్న మృతి చెందారు.
గ్రామానికి చెందిన జి.సురేశ్ (42) , అతని అన్న కొడుకు అభిలాష్ (20).. పొలంలో బోరు పైపులను పైకి తీస్తుండగా పైనున్న విద్యుత్ వైర్లు ఇనుప పైపులకు తగిలి ప్రమాదం సంభవించింది. ఇరువురు రైతుల మృతితో గ్రామంలో విషాదాన్ని నింపింది.
Last Updated : Jun 25, 2020, 7:21 PM IST