తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏడాదైనా పాసు పుస్తకం ఇవ్వలేదు... అబ్దుల్లాపూర్​మెట్​లో రైతు ఆందోళన - రంగారెడ్డి జిల్లా వార్తలు

సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ సజీవదహనం ఘటనకు ఏడాది గడుస్తుంది. ఆ ఘటనలో గాయపడిన ఓ రైతుకు మాత్రం ఇప్పటికీ న్యాయం జరగలేదు. తాను కోలుకోడానికి మాత్రం పది లక్షలు ఖర్చు చేసిన రైతు.. తన పాసు పుస్తకం పొందలేకపోయానని ఆందోళనకు దిగాడు.

farmer protest in abdullapurmet mro office for pass book
farmer protest in abdullapurmet mro office for pass book

By

Published : Nov 3, 2020, 11:36 AM IST

'దుర్ఘటన జరిగి ఏడాది గడుస్తున్నా పాసు పుస్తకం ఇవ్వలేదు'

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు కుటుంబం ఆందోళన చేపట్టింది. ఏడాది అవుతున్నా... తనకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వలేదని కుటుంబసభ్యులతో కలిసి నారాయణగౌడ్ అనే రైతు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. ఏడాది క్రితం తహసీల్దార్‌ విజయ సజీవదహన ఘటనలో నారాయణగౌడ్‌ గాయపడ్డారు. తీవ్రగాయాలు కావడంతో దాదాపు 10 లక్షలు ఖర్చు చేసి చికిత్స తీసుకున్నారు.

ఘటన జరిగిన రోజు నారాయణగౌడ్​ పాసు పుస్తకం కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చారు. ఆ ఘటన వల్ల అధికారులు బాధితునికి పాసుపుస్తకం జారీ చేయలేదు. తహసీల్దార్‌ సజీవదహనం ఘటన జరిగి ఏడాది దాటినా... తనకు మాత్రం పాసుపుస్తకం ఇంకా అందలేదు. తమ గోడు విని న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి: కరోనా కాచుకుంది... తస్మాత్‌ జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details