తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో పొలం వద్దే రైతు మృతి - విద్యుదాఘాతంతో రైతు మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం నాంచేరి గ్రామంలో ఓ రైతు విద్యుదాఘాతం కారణంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

farmer died with electrocollision
విద్యుదాఘాతంతో పొలం వద్దే రైతు మృతి

By

Published : May 31, 2020, 6:01 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం నాంచేరి గ్రామానికి చెందిన ఆలూరు అంజయ్య రోజూ లాగే తన పొలం వద్దకు వెళ్లాడు. పశువులకు నీరు పెట్టేందుకని వెళ్లి ప్రమాదవశాత్తు మోటర్​పై పడటంతో కరెంట్ షాక్ తగిలింది. అంజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

ఉదయం పంట పొలానికి వెళ్లిన తండ్రి మధ్యాహ్నమవుతున్నా ఇంటికి రాకపోవడం వల్ల కొడుకే వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరాడు. వచ్చి చూసేసరికి తండ్రి అంజయ్య మృతి చెందాడు. కొడుకు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా

ABOUT THE AUTHOR

...view details