తెలంగాణ

telangana

By

Published : Apr 16, 2020, 11:05 AM IST

ETV Bharat / state

జీతాల కోసం ఆర్డీవో ఆఫీస్ ముందు కార్మికుల ధర్నా...

పనిచేయని దినాలకూ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. పని రోజులకు కూడా యాజమాన్యాలు వేతనాలు ఇవ్వట్లేదంటూ కార్మికులు ఆందోళన బాట పట్టారు.

నెల జీతం ఇవ్వాలి : కార్మికులు
నెల జీతం ఇవ్వాలి : కార్మికులు

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ ఆర్డీవో కార్యాలయం ముందు కార్మికులు నిరసన చేపట్టారు. మండల పరిధిలోని ఎలికట్ట, మొగిలిగిద్ద గ్రామాల శివారులో స్పాంజ్ ఐరన్ పరిశ్రమలు ఉన్నాయి. ఆయా సంస్థల్లో గత 15 రోజులుగా కార్మికులకు జీతాలే ఇవ్వట్లేదు. గత నెలలో కార్మికులు 20 రోజులు పని చేయగా... 10 రోజులు లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. సర్కార్ నియమ నిబంధనల ప్రకారం పని చేయని 10 రోజులకు కూడా జీతం కట్టివ్వాలి సంస్థలు. కానీ అంతకు ముందు పని చేసిన 20 రోజుల డబ్బులు కూడా చెల్లించట్లేదంటూ 100 మందికి పైగా కార్మికులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. స్పందించిన ఆర్డీవో నేరుగా పరిశ్రమ వర్గాలతో చర్చలు జరిపారు. వెంటనే జీతాలు చెల్లించాలని ఆదేశించారు. గురువారం వేతనాలు ఇస్తామని యాజమాన్యాలు హామీ ఇచ్చినట్లు ఆర్డీఓ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details