Bandi Sanjay F2F: 'తెరాస సర్కార్ ఎనిమిదేళ్లుగా నియంతృత్వ, నిరంకుశ పాలన సాగిస్తోంది. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నాం. తెలంగాణకు కేంద్రం అనేక రూపాల్లో నిధులు అందిస్తోంది. ప్రధాని మోదీకి పేరు రావద్దనేది కేసీఆర్ ఆలోచన. అందుకోసం అనేక కేంద్ర పథకాలను అమలుచేయటంలేదు. పార్టీని అప్రతిష్ఠపాలు చేసేందుకు కాంగ్రెస్, తెరాస ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల వేళ ఆంధ్ర, తెలంగాణ ప్రజలు మా వాళ్లే అంటారు. ఎన్నికల పూర్తయ్యాక ఆంధ్ర ప్రజలను కేసీఆర్ తిడుతుంటారు. ఆర్డీఎస్ సమస్యకు కేసీఆర్ పరిష్కారం చూపలేకపోయారు. జీవో 69కింద ప్రాజెక్టుల నిర్మాణానికి భాజపా అనుకూలంగా ఉంటుంది. కృష్ణా జలాల్లో ఏపీ, కర్ణాటకలు వాటాల కంటే ఎక్కువ తీసుకుంటున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది. కాంగ్రెస్, తెరాస పాలన చూసిన ప్రజలు భాజపాకు అవకాశమివ్వండి.' -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
'ఒక్క అవకాశమివ్వండి.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే రాష్ట్ర అభివృద్ధి'
Bandi Sanjay F2F: తెరాస, కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు భాజపాకు ఒక్క అవకాశమివ్వాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర ముగించుకున్న ఆయన.. రంగారెడ్డి జిల్లాకు చేరుకున్నారు. పాలమూరు పచ్చబడిందని కేసీఆర్ అందరినీ నమ్మిస్తున్నారని.. మరింత ఎడారిగా మారిన ప్రాంతాన్ని తాము చూశామని బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీకి ఎక్కడ పేరొస్తుందోనన్న ఆలోచనతోనే కేంద్ర పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని విమర్శించారు. భాజపా ఒక వ్యక్తి నిర్ణయాలతో సాగేది కాదని.. ఎలాంటి విభేదాలున్నా అంతర్గతంగా పరిష్కరించుకుంటామని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమంటున్న బండి సంజయ్‌తో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
బండి సంజయ్‌తో ముఖాముఖి