ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయకిరణ్ యాదవ్ షాద్‌నగర్‌లో ఉంటూ కొందుర్గు శివారులోని ఓ టెక్స్‌టైల్స్‌లో పనిచేస్తున్నాడు. జూన్ 30న రాత్రి 8 గంటలకు విధులు ముగించుకుని షాద్‌నగర్ వెళ్లేందుకు రోడ్డుపై నిలబడి ఉన్నాడు. కొందుర్గు వైపు నుంచి షాద్‌నగర్ వెళ్తున్న ఓ కారును లిఫ్ట్ అడిగి ఎక్కాడు. డ్రైవర్ శివకుమార్, అందులో ఉన్న మరో ఇద్దరు రమేశ్, రాజు అలియాస్ రూప్లా కారులోనే జయకిరణ్‌ను బెదిరించి ఏటీఎం కార్డు తీసుకొని పాస్‌వర్డ్ తెలుసుకున్నారు. షాబాద్ శివారులో బాధితుడిని వదిలేశారు.
లిఫ్ట్ అడిగి కారులో ఎక్కిన పాపానికి.. నిలువు దోపిడీ - తాజా క్రైం వార్తలు
లిఫ్ట్ అడిగి కారులో ఎక్కిన వ్యక్తి వద్ద ఏటీఎం కార్డు లాక్కొని డబ్బులు దోచుకున్న వారిని షాద్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.35 వేలు స్వాధీనం చేసుకున్నారు.
లిఫ్ట్ అడిగి కారులో ఎక్కిన పాపానికి.. నిలువు దోపిడీ
షాద్‌నగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద రూ.20 వేలు, నందిగామ పెట్రోల్ బంకు వద్ద మరో రూ.26 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించారు. జయకిరణ్ నుంచి ఫిర్యాదు అందుకున్న కొందుర్గు ఎస్‌ఐ శ్రీను, జిల్లేడు చౌదరిగూడ ఎస్‌ఐ కృష్ణ, సిబ్బంది గురువారం నిందితులను పట్టుకొని రూ.35వేలు స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్‌పై గతంలో పలు కేసులు ఉన్నాయన్నారు.
TAGGED:
తాజా క్రైం వార్తలు