లాక్డౌన్ సమయంలో మద్యం మత్తును మరిపించేలా కల్తీకల్లు తయారు చేస్తున్న కేంద్రాలపై షాద్నగర్ ఆబ్కారీ అధికారులు దాడులు చేశారు. రంగారెడ్డి జిల్లా ఫారుఖ్ నగర్ మండలం కొందన్నగూడ గ్రామ పరిధిలో అక్రమంగా తయారవుతున్న కల్లు స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు.
కల్తీకల్లు తయారీకేంద్రంపై ఆబ్కారీ పోలీసుల దాడి - Exice police Attacks On Adulteration toddy
లాక్డౌన్ సమయంలో అక్రమంగా కల్తీకల్లు తయారు చేస్తున్న కేంద్రాలపై మహబూబ్ నగర్ ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు.
![కల్తీకల్లు తయారీకేంద్రంపై ఆబ్కారీ పోలీసుల దాడి Exice police Attacks On Adulteration toddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6853579-969-6853579-1587285401303.jpg)
కల్తీకల్లు తయారీకేంద్రంపై ఆబ్కారీ పోలీసుల దాడి
ఈ దాడుల్లో అక్రమంగా తయారు చేసిన మూడు వేల లీటర్ల కల్తీ కల్లు ధ్వంసం చేశారు. కల్తీ కల్లు స్థావరాన్ని అధికారులు ధ్వంసం చేశారు. కల్లు తయారు చేసేందుకు సమకూర్చిన మత్తు పదార్థాలు, స్వాధీనం చేసుకున్నారు. తయారీ దారుల మీద కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:-గృహ హింసకు పాల్పడితే క్వారంటైన్కే!
TAGGED:
ఎక్సైజ్ పోలీసులు