తెలంగాణ

telangana

ETV Bharat / state

షాద్​నగర్​లో ఐసోలేషన్​ కేంద్రం: శ్రీనివాస్​ గౌడ్​ - ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్ తాజా​ వార్తలు

షాద్​నగర్​లో ఐసోలేషన్​ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లోని ఎంపీడీవో కార్యాలయంలో కరోనాపై సమీక్ష నిర్వహించారు.

ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​
ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

By

Published : May 13, 2021, 10:58 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లోని ఎంపీడీవో కార్యాలయంలో ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చేవెళ్ల ఎంపీ శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, కలెక్టర్ అమోయ్ కుమార్ హాజరయ్యారు.

షాద్​నగర్​లో 30 పడకలతో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంతో పాటు మరో మూడు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆక్సిజన్, రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు మందులు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. బాధితులకు మెరుగైన చికిత్స, మందులు, ఆక్సిజన్ అందించడానికి ప్రభుత్వం ఎంత ఖర్చైనా చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు.

షాద్​నగర్ ప్రాంతంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స కోసం బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించారు. బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:గంగానది ఒడ్డున ఇసుకలో మృతదేహాల కలకలం

ABOUT THE AUTHOR

...view details