ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేరుకు మాత్రం 1.5 లక్షల కోట్లు... ఖర్చు చేయడంలో మాత్రం సగం కూడా ఉండదని చేవెళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ సమస్యలు వెంటనే పరిష్కరించి అన్నదాతలకు న్యాయం చేయాలంటూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ధర్నా నిర్వహించారు. బడ్జెట్లో విద్య ,వైద్య రంగాలకు సరిపడ నిధులు కేటాయించడం లేదని దుయ్యబట్టారు. రైతుల సమస్యలను పరిష్కారించకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.
'రైతుబంధు, రుణమాఫీ సమస్యలను పరిష్కారించాలి'
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరు ఎన్నికల ముందు బాగుంటుందని... ఆ తర్వాత నాలుగేళ్లపాటు పథకాలు నామమాత్రంగానే మిగులుతాయని చేవెళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు.
'రైతుబంధు, రుణమాఫీ సమస్యలను పరిష్కారించాలి'