రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీల్లో రూ. 50 కోట్లు ఖర్చు పెట్టానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఇవాళ తన నియోజకవర్గంలోని గండిపేట మండలంలోని మణికొండ, పుప్పాలగూడ గ్రామాలలో కోటి పది లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ తన నియోజవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని చెప్పారు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన - latest news of newly formed municipalities
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శంకుస్థాపన చేశారు.
కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన