రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామ సర్పంచ్ రాంరెడ్డి.. ఊరంతా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కొన్ని రోజులుగా ఉపాధి లేక ప్రజలు పస్తులుంటున్నారని తెలుసుకున్న ఆయన... వారికోసం తన సొంత నిధులతో కందిపప్పు, చక్కెర, వంట నూనె, ఉల్లిపాయలు వంటి సామగ్రిని అందించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పిలుపును ప్రజలందరూ స్వాగతించారని సర్పంచ్ రాంరెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే స్వీయ నిర్బంధం అవసరమన్నారు.
నిత్యావసర సరుకులు పంచిన సర్పంచ్ - లాక్‌డౌన్ రంగారెడ్డి ఉప్పరిగూడా సర్పంచ్
లాక్‌డౌన్ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరి గూడ గ్రామ సర్పంచ్ ఊరంతా నిత్యావసర సరుకులను పంచి పెట్టాడు. గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Essential commodities Distribution