students arrived: ఆపరేషన్ గంగలో భాగంగా.. ఉక్రెయిన్ నుంచి 11మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రి 8.30 గంటల సమయంలో వీరంతా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానంలో వీరంతా ముంబయికి చేరుకొని అక్కడి నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్ వచ్చారు.
students arrived: శంషాబాద్ చేరుకున్న మరో 11 మంది తెలుగు విద్యార్థులు
21:07 February 28
students arrived:శంషాబాద్ చేరుకున్న మరో 11 మంది తెలుగు విద్యార్థులు
భావోద్వేగానికి గురైన తల్లిదండ్రులు
కొద్దిరోజులుగా బాంబుల మోతతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తమ వారి రాకతో వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఎయిర్పోర్టులో ఉద్విగ్నమైన వాతావరణం ఏర్పడింది.
ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థులు ఇంకా 2000మంది వరకు ఉంటారని అంచనా. వారిని కూడా వీలైనంత త్వరగా తీసుకురావాలని వారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇవాళ జరిగిన చర్చల్లో ఎలాంటి స్పష్టత రాలేదు. ఫలితంగా యుద్ధం కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: