రేపు జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్‌కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శేరిగూడలోని శ్రీ ఇందు కళాశాలలో ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డులు ఉండగా.. రెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.
ఇబ్రహీంపట్నంలో ఎన్నికలకు రంగం సిద్ధం - రంగారెడ్డి జిల్లా తాజా వార్త
రేపు జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల సామగ్రిని శేరిగూడలోని ఓ కళాశాలలో భద్రపరిచారు.

ఇబ్రహీంపట్నంలో ఎన్నికలకు రంగం సిద్ధం
మొత్తం 22 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 45 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 275 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నంలో ఎన్నికలకు రంగం సిద్ధం
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: ఓటర్లను మత్తులో ముంచుతున్న అభ్యర్థులు