ఎంపిక:మొదట వివిధ అంశాల మీద రాత పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ప్రావీణ్యాన్నీ, అనువాద సామర్థ్యాన్నీ, వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్నీ పరీక్షించే లఘు, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. వీటిలో ఉత్తీర్ణులైన వారికి బృందచర్చలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. సంస్థ నియమ నిబంధనలకు లోబడి తుది ఎంపిక ఉంటుంది.
శిక్షణ, భృతి:ఈనాడు జర్నలిజం స్కూలులో ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి ఆరు నెలలు Rs. 14,000, తరువాతి ఆరు నెలలు Rs.15,000 చొప్పున నెలవారీ భృతి లభిస్తుంది.
ఉద్యోగంలో:స్కూల్లో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రెయినీలుగా అవకాశం లభిస్తుంది. ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో Rs. 18,000 జీతం ఉంటుంది. అది పూర్తయ్యాక, శిక్షణార్థుల వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఒక ఏడాది ప్రొబేషన్‌లో Rs. 20,000 వరకూ, ఆ తరువాత కన్ఫర్మేషన్‌లో Rs. 22,000 వరకూ జీతభత్యాలు ఉంటాయి.