రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని 17, 18, 19, 20 వార్డుల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. 17,18,19 వార్డుల్లో సుమారు రూ.90 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్, డ్రైనేజీ, ఓపెన్ నాలాపై స్లాబు పనులకు శంకుస్థాపన చేశారు.
20వ వార్డులో రూ.64 లక్షల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ తాగునీటి ట్యాంకును ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు జల్పల్లి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, కౌన్సిలర్లు లక్ష్మీ నారాయణ, పల్లపు శంకర్, బాషమ్మ, శంశుద్దిన్, తెరాస పార్టీ అధ్యక్షుడు ఇక్బాల్ బిన్ ఖలీఫా, ఉపాధ్యక్షుడు యూసుఫ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.