తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంత్​నగర్​ కాలనీలో వైభవంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు - వనస్థలీపురంలో దసరా వేడుకలు

వనస్థలిపురం ప్రశాంత్​నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో 13 వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవీశరన్నవరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Dussehra
Dussehra

By

Published : Oct 13, 2021, 2:04 AM IST

Updated : Oct 13, 2021, 6:07 AM IST

రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ప్రశాంత్​నగర్​లోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం... చండీహోమం, ఆలయ సంప్రోక్షణ, సరస్వతి అలంకరణ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్​కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, ఆలయ కమిటీ ఛైర్మన్​ సంరెడ్డి భుజంగరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత్​నగర్​ కాలనీలో వైభవంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

ఇదీ చూడండి:Srishakthi Awards:'మహిళకు అవార్డు వచ్చిందంటే... ఆ కుటుంబానికి వచ్చినట్టే'

Last Updated : Oct 13, 2021, 6:07 AM IST

ABOUT THE AUTHOR

...view details