డ్రంకెన్ డ్రైవ్‌లో మందుబాబుల హల్‌చల్ - Rangareddy district latest news
రంగారెడ్డి జిల్లా చంపాపేట్ వద్ద డ్రంకెన్ డ్రైవ్‌లో మందుబాబులు హల్‌చల్ చేశారు. చంపాపేట్ ప్రధాన రహదారిపై మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. పోలీసుల తనిఖీలను చూసిన మందుబాబులు.. వాహనాలను వదిలేసి పారిపోయారు. మరికొందరు వాహనాలతో పక్కనే ఉన్న ఫంక్షన్హాల్లో దూరారు. వారిని గమనించిన పోలీసులు ఫంక్షన్‌హాల్‌లోకి వెళ్లి పట్టుకున్నారు. ఇంకొందరు కాలనీల్లోని ఇంట్లోకి వెళ్లగా.. వారిని పట్టుకుని కేసులు నమోదు చేశారు.