తల్లీ, కూతురుకి మత్తుమందు ఇచ్చిన యజమాని.. ఆపై అత్యాచారం..! - అద్దెకున్న వారికి మత్తు మందు ఇచ్చిన యజమాని
12:51 July 22
తల్లీ, కూతురుకి మత్తుమందు ఇచ్చిన యజమాని.. ఆపై అత్యాచారం..!
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి పాపిరెడ్డి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంటి యాజమాని తన స్నేహితులతో కలిసి అద్దెకు ఉంటున్న మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికులు ఆరోపణ
అద్దెకున్న వారికి ఆహారంలో ఇంటి యజమాని... అతని స్నేహితులతో కలిపి మత్తుమందు కలిపాడని స్థానికులు తెలిపారు. వాళ్లు స్పృహ కోల్పోయిన తర్వాత మహిళ, కుమార్తెపై అత్యాచారం చేశారని ఆరోపించారు. స్థానికులు ఫిర్యాదుతో చందానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. కుమారుడికి నిలోఫర్లో ... కుమార్తె, తల్లీకి ఉస్మానియాలో చికిత్స ఇస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
మత్తు మందు ఇచ్చిన యజమాని