తెలంగాణ

telangana

ETV Bharat / state

పోటాపోటీగా నార్సింగి పురపాలిక ఫలితాలు - Narsingi municipality election results

రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పురపాలికలో హస్తం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందినా... పీఠం సాధిస్తామా? లేదా? అనే సందిగ్ధంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఉన్నాయి.

Narsingi municipality election results
పోటాపోటీగా నార్సింగి పురపాలిక ఫలితాలు

By

Published : Jan 25, 2020, 4:42 PM IST

రంగారెడ్డి జిల్లా పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. నార్సింగి మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. కానీ ఛైర్మన్ పదవిపై మాత్రం హస్తం పార్టీ శ్రేణులు సందిగ్ధంలో పడ్డాయి.

పురపాలిక పరిధిలోని 18 వార్డుల్లో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. తెరాస ఏడు స్థానాల్లో, భాజపా ఒక వార్డులో విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థులు రెండు వార్డుల్లో గెలుపొందారు.

ABOUT THE AUTHOR

...view details