Dogs Parade: పోలీస్ శాఖకు నేర పరిశోధనలో శిక్షణ పొందిన పోలీస్ జాగిలాలు కీలక పాత్ర వహిస్తున్నాయని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ శిక్షణా కేంద్రంలో మొత్తం 33 పోలీస్ జాగిలాలు, 47 మంది శిక్షకుల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు.
Dogs Parade: పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ - principal secretary of the state home department ravi gupta
Dogs Parade: హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించడంలో శిక్షణ పొందిన జాగిలాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా అన్నారు. ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ శిక్షణా కేంద్రంలో జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు.
![Dogs Parade: పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ Dogs Parade: 'నేర పరిశోధనలో శిక్షణ పొందిన జాగిలాలది కీలక పాత్ర'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14578658-470-14578658-1645882920397.jpg)
Dogs Parade: 'నేర పరిశోధనలో శిక్షణ పొందిన జాగిలాలది కీలక పాత్ర'
హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడంలో పోలీసు జాగిలాలు కీలక పాత్ర వహిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన జాగిలాల ప్రదర్శనలను ఆయన పరిశీలించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ చూపించిన జాగిలాలకు ట్రోఫీలను అందించారు. ఈ కార్యక్రమంలో ఇంటలిజెన్స్ విభాగం అదనపు డీజీ అనిల్ కుమార్, ఐజీ రాజేష్ కుమార్, డీఐజీ తొఫిక్ ఇక్బాల్‌లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: