మహిళా సంఘాల అభివృద్ధి కోసమే వారికి నర్సరీ నిర్వాహణ బాధ్యతను అప్పగిస్తున్నట్లు... రంగారెడ్డి జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పాద రామేశ్వర్ తెలిపారు. పట్టణ ప్రగతి నిధుల ద్వారా నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని జల్‌పల్లి మున్సిపాలిటీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి... హరిత హారం, వీధి వ్యాపారులకు రుణాలు అందజేత వంటి పలు అంశాలపై ఆరా తీశారు.
'మహిళా సంఘాల అభివృద్ధి కోసమే నర్సరీల అప్పగింత' - Rangareddy District latest news
రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపాలిటీలో జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పాద రామేశ్వర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హరిత హారం, వీధి వ్యాపారులకు రుణాలు వంటి పలు అంశాలపై ఆరా తీశారు. శ్రీరాం కాలనీలో మెప్మా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న నర్సరీ ప్రాంతాన్ని డైరెక్టర్ పరిశీలించారు.

'మహిళా సంఘాల అభివృద్ధి కోసమే నర్సరీల అప్పగింత'
వీధి వ్యాపారులలో అర్హులందరికీ రుణాలు అందే విధంగా చూస్తామని అన్నారు. శ్రీరాం కాలనీలో మెప్మా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న నర్సరీ ప్రాంతాన్ని డైరెక్టర్ పరిశీలించారు. తమకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధికి అవకాశం ఇస్తున్నందుకు మెప్మా పీడీ, మున్సిపల్ కమిషనర్‌కు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: నిర్లక్ష్యంతోనే పెరుగుతున్న కరోనా కేసులు