గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రంగారెడ్డి జిల్లా పహడి షరీఫ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి జల్పల్లి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహ్మదీయా కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఐ విష్ణువర్ధన్తో కలిసి పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.
పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ - జల్పల్లి మున్సిపల్ కమిషనర్
పహడి షరీఫ్‌లోని మహ్మదీయా కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జల్పల్లి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
ఈ కార్యక్రమంలో తెరాస నేత కొండల్ యాదవ్, అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ హమీద్, ప్రధాన కార్యదర్శి అమణుల్లా ఖాన్, కోశాధికారి ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఆమె వద్దంటే అనుష్క 'అరుంధతి'గా మారింది!