తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కాలంలోనూ ఆగని సంక్షేమం: ఎమ్మెల్యే మంచిరెడ్డి - kalyana lakshmi cheque distribution

కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక సర్కార్ తెలంగాణ ప్రభుత్వమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

Telangana News, MLA Manchireddy Kishan Reddy, Kalyana Lakshmi cheque
తెలంగాణ వార్తలు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కల్యాణ లక్ష్మి చెక్కులు

By

Published : May 24, 2021, 2:48 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని, కరోనా, లాక్​డౌన్ నేపథ్యంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక సర్కార్ తెలంగాణదేనని ఎమ్మెల్యే తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఈ సంక్షేమ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్​డౌన్ అమల్లో ఉందని, ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details