రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కె పురం డివిజన్‌కు చెందిన 50 వలస కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్యాకెట్లలో బియ్యం, గోధుమ పిండి, వంట నూనె, కందిపప్పు, కారం ప్యాక్ చేసి అందించారు. సీనియర్ కాంగ్రెస్ నేత దేప భాస్కర్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా నియంత్రణకు స్వీయ నియంత్రణ పాటించాలని కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు గణేష్ సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో వలస కూలీలకు సరకుల పంపిణీ - RC PURAM DIVISION CONGRESS PRESIDENT
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కె పురంలో వలస కూలీలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని స్థానిక కాంగ్రెస్ నేతలు కోరారు.
మహేశ్వరంలో నిత్యావసర సరకుల పంపిణీ