తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షాలతో ఇళ్లు కూలిన బాధితులకు చెక్కుల పంపిణీ - తెలంగాణ వార్తలు

గతేడాది కురిసిన వర్షాలతో రంగారెడ్డి జిల్లా బాలాపూర్​లో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం అందజేశారు. బాధితులకు మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఉస్మాన్ నగర్​లో పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల కోసం ప్రత్యేక ప్యాకేజీ వచ్చేటట్లు చేస్తామని మంత్రి తెలిపారు.

minister sabitha indra reddy cheques distribution, balapur cheques distribution
బాలాపూర్​లో చెక్కుల పంపిణీ, చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

By

Published : Apr 30, 2021, 5:06 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీ బాలాపూర్​లో గతేడాది కురిసిన భారీ వర్షానికి ఇళ్లు కూలి నష్టపోయిన బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇళ్లు బాగా దెబ్బతిన్న 23మందికి ఒక్కొక్కరికి రూ.95,100 చెక్కులను, పాక్షికంగా కూలిన 28 మందికి ఒక్కొక్కరికి రూ.3,200 చెక్కులను అందజేశారు. రూ.47లక్షల విలువ చేసే మెషీన్​ను ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాదితో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జల్​పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్, బాలాపూర్ మండలం డిప్యూటీ తహసీల్దార్ సిబ్బంది, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. ఉస్మాన్ నగర్​లో పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల కోసం ప్రత్యేక ప్యాకేజీ వచ్చేటట్లు చేస్తామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి:జర్నలిస్టుల కోసం హెల్ప్​డెస్క్‌... రేపటి నుంచే అందుబాటులోకి..

ABOUT THE AUTHOR

...view details