సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఓయూలో తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు చటారి దశరథ్ ఆధ్వర్యంలో పుస్తకాలను పంపిణీ చేశారు. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్న సుమారు 500 మంది నిరుపేద విద్యార్థులకు వీటిని అందజేశారు.
బంగారు తెలంగాణ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలి: చటారి దశరథ్ - telangana cm kcr birthday news
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఓయూలో ఘనంగా నిర్వహించారు. తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు చటారి దశరథ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలా ముందుకు సాగుతోందని దశరథ్ పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని చేపట్టేందుకు సిద్ధమవుతోందని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, వర్సిటీ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వర్చువల్ విధానంలో భువనగిరి పోక్సో కోర్టు ప్రారంభం