రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పురపాలక సంఘానికి ఛైరపర్సన్గా హారిక ఎంపికయ్యారు. 14వ వార్డు నుంచి గెలిచిన హస్తం సభ్యురాలు హారికను తెరాసలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఛైర్మన్ గిరి దక్కించుకునేందుకు తెరాస అనైతికంగా వ్యవహరిస్తోందంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు.
చివరి నిమిషంలో ఆదిభట్ల పురపాలిక తెరాస కైవసం - ఆదిభట్ల పురపాలిక
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీని తెరాస కైవసం చేసుకుంది. చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల... కాంగ్రెస్ తరఫున గెలిచిన హారిక తెరాసలో చేరారు. ఆదిభట్ల పురపాలికకు ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు.
![చివరి నిమిషంలో ఆదిభట్ల పురపాలిక తెరాస కైవసం dispute in adibhatla municipality chair person election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5857633-thumbnail-3x2-a.jpg)
ఆదిభట్ల పురపాలిక ఎన్నికలో రసాభాస
మున్సిపల్ సమావేశమందిరంలోకి వెళ్లిన ఎంపీని పోలీసులు బలవంతంగా బయటకు నెట్టివేశారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
ఆదిభట్ల పురపాలిక ఎన్నికలో రసాభాస