రంగారెడ్డి జిల్లాలో అత్యాచారం, హత్యకు గురైన ‘దిశ’కు ఓరుగల్లుతోనూ అనుబంధం ఉంది. ఆమె 8 నుంచి 10వ తరగతి వరకు హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట సమీపంలోని గ్రీన్‌వుడ్ పాఠశాలలో చదివింది. 2006లో ఎనిమిదో తరగతిలో చేరిన దిశ.. వసతి గృహంలో ఉండి చదువుకునేది. పదో తరగతిలో 536 మార్కులు సాధించింది. సహాయ గుణం కలిగిన దిశ పాఠశాల ఇచ్చే మోస్ట్ హెల్పింగ్ స్టూడెంట్పురస్కారానికి నామినేట్ అయిందని పాఠశాల డైరెక్టర్ భరద్వాజనాయుడు తెలిపారు.
'దిశ'ది సాయం చేసే గుణం - priyanka reddy case updates
'దిశ' ది సాయం చేసే గుణమని ఓరుగల్లులో ఆమె విద్యనభ్యసించిన పాఠశాల డైరెక్టర్ భరద్వాజనాయుడు తెలిపారు. పాఠశాల ఇచ్చే మోస్ట్ హెల్పింగ్ స్టూడెంట్ పురస్కారానికి నామినేట్ అయినట్లు పేర్కొన్నారు.
'‘దిశ’'ది సాయం చేసే గుణం