సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో కీలకమైన శాస్త్రీయ ఆధారం లభించింది. చటాన్‌పల్లి వంతెన కింద కాలిన మృతదేహం దిశదేనని డీఎన్‌ఏ విశ్లేషణలో తేలింది. పూర్తిగా కాలిపోయిన మృతదేహం నుంచి సేకరించిన ఎముక కాండం (బోన్ స్టెమ్) ఆధారంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు నిర్ధారించారు. దిశ రక్తసంబంధీకుల నుంచి సేకరించిన డీఎన్‌ఏ ప్రొఫైల్‌తో ఆ ఎముక కాండాన్ని క్రోడీకరించడం ద్వారా గుర్తించారు. ఈ నివేదిక తాజాగా సైబరాబాద్ పోలీసులకు అందింది. దిశ హత్యాచారం కేసులో ఈ నివేదిక కీలకం కానుంది. ఇది శాస్త్రీయ ఆధారం కావడం వల్ల కేసుకు బలమైన సాక్ష్యంగా మారనుంది.
కాలిన మృతదేహం దిశదే..! - dish murder case
దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక ఆధారం లభించింది. చటానపల్లి వంతెన కింద కాలిన మృతదేహం దిశదేనని డీఎన్‌ఏ విశ్లేషణలో తేలింది.
మరోవైపు దిశపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించే నివేదిక మాత్రం ఇంకా పోలీసులకు అందలేదు. తొండుపల్లి టోల్‌ప్లాజా సమీపంలో దొరికిన ఆమె లోదుస్తులపై వీర్యకణాల్ని పోలీసులు అప్పుడే సేకరించారు. వాటిని విశ్లేషించే నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. అలాగే ఘటనాస్థలిలోనే కొన్ని వెంట్రుకల్ని సేకరించారు. అవి నిందితులవిగా భావిస్తుండటంతో వాటినీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. నిందితుల రక్తసంబంధీకుల నుంచి సేకరించిన డీఎన్‌ఏ ప్రొఫైల్‌లతో వాటిని సరిపోల్చే అంశంపై దృష్టి సారించారు. అవి సరిపోలితే నిందితులే దిశపై అత్యాచారం చేసినట్లు మరో బలమైన సాక్ష్యం కానుంది. ఒకట్రెండు రోజుల్లోనే ల్యాబ్ నుంచి ఈ నివేదిక అందే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అదరగొట్టిన భారత త్రయం.. టీ20 సిరీస్ కోహ్లీసేనదే